RAMON MAGSAYSAY AWARDS 2023

మనిలా (సెప్టెంబర్ – 01) : ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డు – 2023 (roman Magsaysay awards 2023) భారతీయ వైద్యుడు డాక్టర్ రవి కన్నన్ (ravi kannam) ఎంపికయ్యారు.

డాక్టర్ రవి కన్నన్ తో పాటు ఫిలిపీన్స్ కు చెందిన ప్రొఫెసర్ మిరియం కొరొనెల్ ఫెర్రర్, తూర్పు తైమూర్ కు చెందిన యూజెనియో లెమోస్, బంగ్లాదేశ్ కు చెందిన కొర్వి రక్షందల ను పురస్కారం వరించింది. వీరికి నవంబరు 11న మనీలాలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు.

Romnan Magsaysay Awardees 2023

  • డాక్టర్ రవి కన్నన్ – ఇండియా
  • ప్రొఫెసర్ మిరియం కొరొనెల్ ఫెర్రర్ – ఫిలిప్పీన్స్
  • యూజెనియో లెమోస్ – తూర్పు తైమూర్
  • కొర్వి రక్షందల – బంగ్లాదేశ్

డాక్టర్ రవి కన్నన్ ఎటువంటి సదుపాయాలుండని గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలందిస్తునందుకు ప్రస్తుత ఏడాదికి సంబంధించిన రామన్ మెగసెసె అవార్డు వరించింది. సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ రవి కన్నన్ చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కీలకమైన పదవిని త్యజించి ఈశాన్య భారతదేశంలోని గ్రామీణ ప్రాంత రోగులకు సేవలను అందించడం ప్రారంభించారు. 2007లో 23 మంది సిబ్బందితో మొదలైన కచర్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం యొక్క నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.

Comments are closed.