16 వేల తాత్కాలిక ఉద్యోగుల రెన్యూవల్

BIKKI NEWS (APRIL 20) : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య సంచాలకుల పరిధిలోని 16,024 పోస్టుల రెన్యూవల్ గడువు ను పెంచుతూ (renewal of contract and out sourcing employees in health department) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డీఎంఈ పరిధిలోని 4,013 కాంట్రాక్టు ఉద్యోగాలు, 9,684 అవుట్సోర్సింగ్ పోస్టులు, 2,322 గౌరవ వేతనం కింద ఉన్న పోస్టుల రెన్యువల్ గడువును 2025 మార్చి 31వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.