RBI JOBS : 450 ASSISTANT JOBS నోటిఫికేషన్

ముంబై (సెప్టెంబర్ – 14) : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi assistant 2023 jobs notification) దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో పని చేయడానికి 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హతలు : 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : సెప్టెంబరు ఒకటి 2023 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 450/- (SC,ST, PwWD, EX.SER – 50/-)

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 04 వరకు

ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష (100 మార్కులు), మెయిన్స్ పరీక్ష (200 మార్కులు), లాంగ్వేజ్ ప్రొఫిషియొన్షీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడును.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ : నవంబర్ 18 & 19 – 2023

మెయిన్స్ పరీక్ష తేదీ : డిసెంబర్ – 31- 2023

వెబ్సైట్ : https://opportunities.rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=4315