SLvsPAK : ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ గెలుపు

హైదరాబాద్ (అక్టోబర్ – 10) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ – శ్రీలంక జట్లు మద్య జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ ను అవలీలగా చేదించి పాకిస్థాన్ విజయం సాదించింది. శ్రీలంక విసిరిన 345 పరుగుల లక్ష్యం ను కేవలం 4 వికెట్లు కోల్పోయి చేదించింది. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులను చేదించిన జట్టు గా పాకిస్థాన్ నిలిచింది.

పాకిస్థాన్ బ్యాట్స‌మన్ లలో రిజ్వాన్ 134*, అబ్దుల్లా షపీఖ్ 113 పరుగులతో రాణించి ఘనవిజయం అందించారు. ప్రపంచ కప్ లో భారత గడ్డపై సెంచరీలు చేసిన పాకిస్థాన్ బ్యాట్స‌మన్ గా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు.

కుశాల్ మెండీస్ (122), సదీరా సమరవిక్రమ (108) సెంచరీలతో, నిశాంక (51) అర్ద సెంచరీ తో విరుచుకుపడ్డారు. దీంతో శ్రీలంక 344 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో హసన్ ఆలీ – 4, రౌఫ్ – 2వికెట్లు తీశారు

ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు సెంచరీలు నమోదు కావడం విశేషం. అలాగే పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లలో ను నెగ్గి నాలుగు పాయింట్లు కైవసం చేసుకోగా.. శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి ఇంకా పాయింట్ల ఖాతాను తెరవలేదు.