BIKKI NEWS (జనవరి – 08) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీ ల అమలు కోసం గత నెల 28 తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల స్థితిని ప్రజలు నేరుగా తెలుసుకోవడానికి వెబ్సైట్ (praja palana direct website link) ఓపెన్ చేసింది ఇందులో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన దరఖాస్తు నెంబర్ ను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు.
కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఐదు గ్యారెంటీ ల దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు
ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులు అనన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించడం జరిగింది.
ప్రజాపాలన వెబ్సైట్ డైరెక్ట్ లింక్