PM MODI – మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురష్కారం

BIKKI NEWS (MARCH 23) : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అయిన “ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్పో” ను (PM MODI honours with Order of Druk Gaylpo Award by Bhutan) అందజేశారు.

భూటాన్ రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన నరేంద్ర మోడీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. భూటాన్ ప్రధాని త్సెరింగ్ టోబ్‌గే మరియు రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ తో భేటీ అయి వివిధ అంశాల మీద ఒప్పందం చేసుకోవడం జరిగింది.

రెండు దేశాల మద్య కోక్రాఘర్ – గెలెపు మరియు బనర్హాట్ – సంత్సే ల మద్య రైల్వే లైన్ లకై ఒప్పందం కుదిరింది.

భూటాన్ లో శక్తివంతమైన బౌద్ధ మఠం తషిచో డిజోంగ్ ను మోడీ సందర్శించనున్నారు.

థింపూ నగరంలో భారత్ సహకారంతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.