NOBEL ECONOMICS 2020 : వేలంపాట విధానాలకు ఆర్థిక నోబెల్

BIKKI NEWS : 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని (NOBEL 2020 IN ECONOMICS) పాల్ మిల్గ్రోమ్ మరియు రాబర్ట్ విల్సన్ లకు ప్రధానం చేశారు. వేలంపాటలో లోని మౌళిక ఆర్థిక సూత్రాలను మరియు సిద్దాంతాలను వివరించినందుకు నూతన వేలంపాట విధానాలను రూపొందించినందుకు ఆర్థిక నోబెల్ దక్కించుకున్నారు. వేలం వేయ‌డం అనేది ప్ర‌తి చోట ఉంటుంద‌ని, అది మ‌న రోజువారి జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.  పౌల్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ విల్స‌న్‌లు క‌నుగొన్న కొత్త వేలం విధానాల‌ వ‌ల్ల అమ్మ‌కందారుల‌కు, కొనుగోలుదారుల‌కు, ప‌న్నుదారుల‌కు లాభం చేకూరినట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.  రేష‌న‌ల్ బిడ్డ‌ర్ల గురించి విల్స‌న్‌,  బిడ్డింగ్‌లో పాల్గొన్న‌వారిలో ఉండే వ్య‌త్యాసాల గురించి పాల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్ల‌ను త‌యారు చేశారు.     ఈ బహుమతిని రిక్స్ బ్యాంకు అల్ర్పేడ్ నోబెల్ జ్ఞాపకార్ధం అందిస్తుంది.

మానవ జీవితం వేలంపాటతో ముడిపడి ఉంది. ప్రభుత్వ పనులు అయినా రోడ్లు, రైల్వే, కరెంటు, విమానాశ్రయాలు, బొగ్గు, టెలికాం, అయుధ సామాగ్రి తదితరాలను దక్కించుకోవాలంటే బిడ్డింగ్ (వేలం పాట) తప్పనిసరి.  క్రీడలలో ఐపీఎల్ బిడ్డింగ్ అందరికీ తెలిసిందే…

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులను తగ్గిఃచుకోవడానికి రివర్స్ టెండరింగ్ లకు వెళ్లి ప్రజా ధనాన్ని ఆదా  చేయడం కూడా ఈ బిడ్డింగ్ ప్రక్రియ లో బాగమే..

● గ్రహీత :: 

1) పాల్ మిల్గ్రోమ్ (అమెరికా)

2)  రాబర్ట్ విల్సన్ (అమెరికా)

● అంశం :: వేలం పాటలో ఆర్థిక సూత్రాలు వివరణ, నూతన వేలంపాట విధానాలను రూపొందించినందుకు.