NOBEL 2020 IN LITERATURE

BIKKI NEWS : 2020 వ సంవత్సరానికి గాను  సాహిత్యం లో నోబెల్ బహుమతి  లూయిస్ గ్లాక్  (1943) కు దక్కింది. మహిళకు దక్కడం  విశేషం. అమెరికా సాహిత్యంలో పోయోట్రీ తో తనదైన ముద్ర వేసిన గ్లాక్ మొదటి రచన FIRST BORN 1968 లో వ్రాసినది. అమెరికాలోని యేల్ యూనివ‌ర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా చేస్తున్న ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు 12 క‌వితా సంపుటాలు ర‌చించారు. మానవ జీవితంలోని కుటుంబ సంబంధాలు అమె రచనలకు మూలం. అవి  ప్రపంచాన్ని కలిపి ఉంచడానికి ఎంతో తోడ్పడతాయని నోబెల్ కమిటీ పేర్కొన్నది.

1968లో తొలి ర‌చ‌న ఫ‌స్ట్‌బ‌ర్న్‌. అతి త్వ‌ర‌లోనే స‌మ‌కాలీన అమెరికా సాహిత్యంలో ప్ర‌ఖ్యాత క‌వయిత్రిగా పేరుగాంచారు.  గ‌తంలో గ్లాక్ అనేక మేటి అవార్డుల‌ను గెలుచుకున్నారు.  1993లో పులిట్జ‌ర్ ప్రైజ్‌ను కైవ‌సం చేసుకున్నారామె.  2014లో నేష‌న‌ల్ బుక్ అవార్డును గెలుచుకున్నారు.

● విజేత :: లూయిస్ గ్లాక్ (అమెరికా)

● రచనలు ::  

First  Born (1968) మొదటి రచన

The Wild Iris (1992),

Averno (2006)

Faithful and Virtuous Night (2014)