జూనియర్ కళాశాలలకు నూతన నియామావళి జారీ చేసే ఇంటర్ కమీషనరేట్

హైదరాబాద్ (ఏప్రిల్ 28) : తెలంగాణలో కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు పాటించాల్సిన నిబంధనలు విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకొన్నది. ఈ మేరకు గురువారం ఇంటర్ విద్యామండలి కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు జారీ చేశారు.

★ నూతన మార్గదర్శకాలు :

రెసిడెన్షియల్ సహా డే స్కాలర్లు మధ్యలో చదువు మానేస్తే ఫీజు వాపసు చేయాలని సూచించింది.

ఎవరైనా విద్యార్థి ఆరోగ్య సమస్యలు సహా ఇతరత్రా కారణాలతో మధ్యలోనే కాలేజీ మానేస్తే అనుమతించాలి.

విద్యార్థి చెల్లించిన ఫీజులను 7 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి.

మొదటి మూడు నెలల్లో నిష్క్రమిస్తే 75శాతం, ఆ తర్వాత మూడు నెలల తర్వాత వెళ్లిపోతే 50శాతం, ఆ తర్వాత కాలేజీ మానేస్తామంటే 25శాతం ఫీజులు వాపసు చేయాలి. రెసిడెన్షియల్ కాలేజీలకు ఇది వర్తిస్తుంది.

ఎక్స్‌ట్రా క్లాసులు 3 గంటలు మించొద్దు.

ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన భవనం, ప్రాంగణాల్లోనే తరగతులు నిర్వహించాలి.

పీజీలో 50% మార్కులు పొందిన వారినే అధ్యాపకులుగా నియమిం చాలి. ఫ్యాకల్టీకి ఆధార్ బేస్డ్ బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి.

ఫ్యాకల్టీని విద్యాసంవత్సరం మధ్యలో తొలగించరాదు.

ప్రతీ జూనియర్ కాలేజీ సీనియర్ ఫ్యాకల్టీని స్టూడెంట్ కౌన్సిలర్ గా నియమించాలి.

★ రెసిడెన్షియల్ కళాశాలల్లో :

విద్యార్థులకు కనీసం 8 గంటలు నిద్ర తప్పనిసరి.

సాయంత్రం గంట పాటు ఆటవి డుపు(రిక్రియేషన్)కు కేటాయించాలి.

ఏడాదిలో రెండుసార్లు విద్యార్థు లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

యాంటి ర్యాగింగ్ కమిటీలను నియమించాలి.

విద్యార్థులకు 75% హజరు తప్పనిసరి

★ అడ్వర్టయిజిమెంట్లపై నిఘా

కాలేజీలు జారీచేసే అడ్వర్టయిజ్మెంట్లపై గట్టి నిఘా పెట్టనున్నారు. తప్పుడు ప్రకటనలు, ఫేక్ ర్యాంకులను అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విభాగం అనుమతిస్తేనే కాలేజీలు ప్రకటనలు జారీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీ లపై కఠిన చర్యలు తీసుకొంటారు.