JNV LEST 2025 : నవోదయలో 9, 11వ తరగతి ప్రవేశాలు

BIKKI NEWS (OCT. 03) : JNV LEST 2025 NOTIFICATION. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి మరియు 11వ తరగతులలో (Navodaya 9th and 11th class admissions 2025) మిగిలిన ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించినున్న లేటరల్ ఎంట్రీ టెస్ట్ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Navodaya 9th and 11th class admissions 2025

ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను సీట్లు కేటాయింపు చేయనున్నారు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు గడువు : నవంబర్ – 26- 2024 వరకు

ప్రవేశ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 08 – 2025న

అర్హతలు :

తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం

2024 25 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉన్నవారు మాత్రమే అర్హులు స్థానిక జిల్లాకు చెందిన వారై ఉండాలి

మే 1 – 2010 నుండి జూలై 31 – 2020 మధ్య జన్మించి ఉండాలి

పదకొండవ తరగతి ప్రవేశాల కోసం

2024 – 25 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉన్నవారు మాత్రమే అర్హులు స్థానిక జిల్లాకు చెందిన వారై ఉండాలి.

జూన్ 1 – 2008 నుండి జూలై 31 – 2010మధ్య జన్మించి ఉండాలి.

తొమ్మిదో తరగతి ఎంపిక పరీక్ష విధానం

హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్టులలో ప్రశ్నలు అడగబడును. ఓఎంఆర్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రశ్న పత్రం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఉంటుంది

పదకొండవ తరగతి ఎంపిక పరీక్ష విధానం

ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, మెంటల్ ఎబిలిటి సబ్జెక్టులలో ప్రశ్నలు అడగబడును. ఓఎంఆర్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రశ్న పత్రం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఉంటుంది

వెబ్సైట్ : https://navodaya.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు