MSN కంపెనీలో జాబ్ సాధించిన GJC నంగునూరు విద్యార్థి సందీప్

BIKKI NEWS (APRIL 17) : MSN కంపెనీ వారు ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట నందు నిర్వహించిన ఇంటర్వ్యూలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 70 మంది హాజరు కాగా 12 మంది సెలెక్ట్ అయ్యారు
అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరు లో చదివిన సిద్ధన్నపేట గ్రామానికి చెందిన వి సందీప్ అనే విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు

సందీప్ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం వల్ల తల్లి కూలి పని చేస్తూ కష్టపడి కుమారుని చదివించింది. సందీప్ కు కాలేజీలో సిన్సియర్ విద్యార్థిగా గుర్తింపు పొందాడు. దీనికిగాను కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం సందీప్ ను అభినందించారు. సందీప్ జాబు సాధించడంలో అన్ని విధాలుగా కృషి చేసిన కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు సిహెచ్ దేవయ్య కు సందీప్ తల్లి మరియు బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు

అదేవిధంగా అడగగానే కార్య స్థలాన్ని ఇచ్చిన ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్ గారికి, అన్ని కోఆర్డినేట్ చేసిన అధ్యాపకుడు సీహెచ్ దేవయ్య గారికి MSN కంపెనీ యొక్క ఈ కార్య నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.