BIKKI NEWS (SEP. 05) : requesting for pending inter supplementary bills. తెలంగాణ రాష్ట్రంలో 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి జగిత్యాల జిల్లాలో మే నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపర్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్, పేపర్ వాల్యుషన్ క్యాంప్ సంబంధించిన చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లలకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చర్ అసోసియేషన్ 711 రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంచర్ల రాజేష్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులను కోరారు.
requesting for pending inter supplementary bills
పరీక్షలు జరిగి ఇప్పటికే మూడు నెలలు గడిచిన ఇప్పటివరకు బిల్స్ రాకపోవడంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు అధ్యాపకులు విచారం వ్యక్తం చేస్తున్నారు… కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఇప్పటివరకు రాని బిల్లులు మరియు ఎగ్జామ్ డ్యూటీ చేసిన ఇన్విజిలేటర్ల బిల్లులు అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ క్యాంపుకు సంబంధించి స్పాట్ అమౌంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు.
అలాఢే పేపర్ వ్యాల్యూషన్ రెమ్యునరేషన్ లో డీఏలో 20% మినహాయించుకున్న రెమ్యునరేషన్ ను కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా విన్నవించుకున్నారు.