MODI BRICS , GREECE TOUR విశేషాలు

BIKKI NEWS : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 22- 24 వరకు దక్షిణాఫ్రికా లోని జోహెన్నస్‌బర్గ్ లో జరిగిన BRICS SUMMIT 2023 కు హజరయ్యారు అనంతరం ఆగస్టు 25న గ్రీస్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, పలువురి ప్రముఖులతో భేటీ, పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం….

★ MODI at BRICS SUMMIT :

దక్షిణాఫ్రికా లోని జోహెన్నస్‌బర్గ్ లో జరిగిన BRICS SUMMIT 2023 లో PM NARENDRA MODU పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్యను 11 పెంచే నిర్ణయం లో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే 5 దేశాలు ఉండగా నూతనంగా 6 దేశాలు ఈ కూటమిలో చేరనున్నాయి.

అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో కు తెలంగాణ కు చెందిన సురాహీ (కూజాలు) లను బహూకరించారు. రామఫోసౌ సతీమణి కి నాగాలాండ్ శాలువాలు బహూకరించారు.

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా కు గోండు పెయింటింగ్ ను బహూకరించారు. గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ కు చత్తీస్‌గడ్ మూలాలున్న డోక్రా కళాకృతిని అందజేశారు.

★ MODI GREECE TOUR :

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 25వ తేదీన గ్రీస్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి గ్రీస్ దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది హానర్” అవార్డును అందజేశారు. ఒక విదేశీ నేతకు ఈ అవార్డ్ ను అందజేయడం ఇదే తొలిసారి.

ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని ఎథెన్స్ లో గ్రీస్ అధ్యక్షురాలు క్యాటేరీనా ఎన్ సాకెలారోఫౌలౌ మరియు గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సటాకిస్ లతో బేటీ అయ్యారు.

ఈ సందర్భంగా గ్రీస్ భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక సంబంధాలుగా ఉన్నతీకరించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. వార్షిక వాణిజ్య విలువను 2030 సంవత్సరం కల్లా రెట్టింపు చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. 2022 – 23లో ఇరుదేశాల మధ్య వార్షిక వాణిజ్య విలువ 200 కోట్ల డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. రక్షణ రంగంలో మరింత సహకారం పెంపొందించుకోవాలని. జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాలను నిరంతరం నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

1983లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ గ్రీస్ పర్యటన చేశారు. ఆ తర్వాత 40 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం విశేషం.