మేడ్చల్ జిల్లా ఇంటర్ విద్యాధికారికి ఘనంగా సన్మానం

మల్కాజ్గిరి (ఆగస్టు – 09) : తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటైన సందర్భంగా టీజీఎల్ఏ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మబ్బు పరశురాం ఆధ్వర్యంలో మేడ్చల్ ఇంటర్ విద్యాధికారి కిషన్ నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ పక్షాన డిఐఈఓ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి కిషన్ నాయక్ మాట్లాడుతూ టీజీఎల్ఏ నూతన జిల్లా కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు మరియు జిల్లా కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్ విద్యను అందించుటకు కృషి చేయాలని అన్నారు.

టీజీఎల్ఏ జిల్లా అధ్యక్షులు మబ్బు పరశురాం మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల యొక్క సంఖ్య పెంచడానికి మరియు గతంలో కంటే జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు తమ యొక్క సంఘం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిడమర్తి ఉపేందర్ మరియు జిల్లా కోశాధికారి రవి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, వాసంతి స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గౌరవ సలహాదారులు రహిముద్దీన్, జాయింట్ సెక్రటరీస్ శారద, గౌరీ శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్, లేడీ సెక్రటరీ పద్మజ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.