MBBS ఉత్తర్ణత శాతం 40 కాదు, 50 శాతమే – MNC

న్యూఢిల్లీ (అక్టోబర్ 07) : నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఎంబీబీఎస్ కోర్సు ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని 40 శాతానికి తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాత విధానం ప్రకారమే 50 శాతం ఉత్తీర్ణత శాతం (MBBS PASS PERCENTAGE IS 50% SAYS NMC) ఉంటుందని తాజాగా వెల్లడించింది.

పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శుక్రవారం అధికారికంగా ఓ నోటిఫికేషన్ ను ఎన్ఎంసీ విడుదల చేసింది. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సులో అగ్రిగేట్ సబ్జెక్టుల్లో (థియరీ, ప్రాక్టికల్ కలిపి) ఓవరాల్ కోర్సు చివరలో 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అయితే సెప్టెంబర్ ఈ పాస్ పర్సంటేజ్ ను 40 శాతానికి తగ్గిస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది.

దానికి తగ్గట్టుగా కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్) మార్గదర్శకాలను సవరించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.