BRITISH INDIA ACTS : బ్రిటిష్ పాలనలో ప్రధాన చట్టాలు – పూర్తి విశ్లేషణ

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో జనరల్ స్టడీస్ లో కచ్చితంగా బ్రిటిష్ పాలనలో ప్రధాన చట్టాలు (major laws of british rule full analysis list ) వాటి ద్వారా మార్పు చెందిన అంశాలపై కచ్చితంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షిప్తంగా బ్రిటిష్ పాలనలో చట్టాలను నేర్చుకుందాం…

Major Laws of British Rule Full Analysis List

◆ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ :- వారన్ హేస్టింగ్స్

అంశం :- దీని ప్రకారం బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్ గా మార్చారు. అలాగే బొంబాయి. మద్రాసు ప్రెసిడెన్సీలు కలకత్తా అధీనంలోకి వచ్చాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపన.

◆ 1781 రెగ్యులేటింగ్ చట్టం :- వారన్ హేస్టింగ్స్

అంశం :- గవర్నర్ జనరల్ కౌన్సిల్, సుప్రీంకోర్టుల న్యాయాధికారాలను నిర్ధారించారు.

◆ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ :- వారన్ హేస్టింగ్స్

అంశం :- గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను ఏర్పాటు చేశారు.

◆ 1813 చార్టర్ చట్టం :- లార్డ్ మింటో

అంశం :- దేశంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. అలాగే దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని రద్దు చేశారు. అన్ని బ్రిటీష్ కంపెనీలు వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు విద్యారంగానికి రూ. లక్ష కేటాయించారు.

◆ 1829 సతీసహగమన నిషేధ చట్టం:- లార్డ్ విలియం బెంటింక్

అంశం :- రాజారామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీసహగమన దురాచారాన్ని రద్దు చేశారు.

◆ 1833 చార్టర్ యాక్ట్ :- లార్డ్ విలియం బెంటింక్

అంశం :- దీని ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిలో మెకాలేని మొదటి లా మెంబర్ గా చేర్చుకున్నారు. అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్ భారతదేశ గవర్నర్ జనరల్ గా మారారు.

◆ 1853 చార్టర్ యాక్ట్ :- డల్హౌసీ

అంశం :- పోటీ పరీక్షల ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఐసీఎస్ లను నియమించటం ప్రారంభమైంది.

◆ 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టం :- డల్హౌసీ

అంశం :- వితంతు పునర్వివాహాలను చట్టబద్ధం చేశారు.

◆ 1858 భారత ప్రభుత్వ చట్టం :- లార్డ్ కానింగ్

అంశం :- గవర్నర్ జనరల్ ను వైశ్రాయ్ గా మార్చారు. దేశానికి మొదటి రాజ్య కార్యదర్శిగా చార్లెస్ ఉడ్ ను నియమించారు. కంపెనీ పాలన రద్దు. దేశాన్ని ఇంగ్లండ్ రాణి పాలన కిందకు తెచ్చారు.

◆ 1861 భారత మండలి చట్టం :- లార్డ్ కానింగ్

అంశం :- దీని ప్రకారం మద్రాసు, బెంగాల్ తదితర ప్రావిన్లలో లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.

◆ 1892 భారత మండలి చట్టం:- లాన్స్ డౌన్

అంశం :- లెజిస్లేటివ్ కౌన్సిల్ కు పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రారంభించారు.

◆ 1909 భారత ప్రభుత్వ చట్టం :- మింటో (మింటో-మార్లే సంస్కరణలు)

అంశం :- దీని ప్రకారం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిళ్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపారు.

◆ 1919 భారత ప్రభుత్వ చట్టం :- ఛేమ్స్ ఫర్డ్

అంశం :- ప్రావిన్సులలోని అంశాలను పలు విభాగాలుగా వర్గీకరించారు వీటినే మాంటెక్-ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలంటారు.

◆ 1930 శారదా చట్టం :- లార్డ్ ఇర్విన్

అంశం :- దీని ప్రకారం బాలబాలికల వివాహ వయసును వరుసగా 18, 14గా నిర్ణయించారు.

◆ 1935 భారత ప్రభుత్వ చట్టం :- వెల్లింగ్టన్

అంశం :- ఢిల్లీలో ఫెడరల్ కోర్టును 1937లో ఏర్పాటు చేశారు. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కల్పించారు.

◆ 1947 భారత స్వాతంత్ర్య ప్రకటన చట్టం :- మౌంట్‌బాటన్

అంశం :- దీని ప్రకారం బ్రిటీష్ సార్వభౌమాధికారాన్ని రద్దు చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు