SCHOLARSHIP : బీసీ విదేశీ విద్యానిధి దరఖాస్తులు

హైదరాబాద్ (ఆగస్టు – 17) : మహాత్మా జ్యోతిబా ఫులె విదేశీ విద్యానిధి పథకం (mahathma jyothiba Phule Overseas education scholarship) కింద 2023 సెప్టెంబరు (ఫాల్ సీజన్) కాలానికి బీసీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

TS E – PASS వెబ్సైట్ లో సెప్టెంబరు 1 నుంచి 30 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదని వివరించారు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ రంగాల్లో 60 శాతం మార్కులు పొందిన వారు అర్హులని తెలిపారు.

విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి ఆహ్వానం(ఐ-20), వీసా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఈ-పాస్ వెబ్సైట్ సందర్శించాలని వెల్లడించారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/