కొత్త లోకల్ క్యాడర్ (జోనల్ క్యాడర్) – సందేహాలు – సమాధానాలు

BIKKI NEWS : TELANGANA LOCAL CADRE STRENGTH DOUBTS AND ANSWERS

CREDITS – AKULA RAJU

(జి. ఓ 317 ఆధారం )

సందేహం : కొత్త జోనల్ విధానం కేటాయింపు లో స్థానికత ఆధారంగా కేటాయింపు అవకాశం ఉందా?

వివరణ : లేదు. పూర్తిగా పూర్వపు జోన్ మరియు సీనియరిటీ ఆధారంగా ఉంటుంది.

సందేహం : నేను పూర్వపు 5 వ జోన్ ఉద్యోగిని. ఇప్పుడు పూర్వపు 6 వ జోన్ పరిధి లోని కొత్త జోన్ కి ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : పూర్వపు 5 వ జోన్ పరిధిలో ఏర్పడిన కొత్త జోన్ లో మాత్రమే ఆప్షన్ ఇవ్వవలెను.

సందేహం : ఏదైనా ఒకే జోన్ ఆప్షన్ ఇవ్వొవచ్చా?

వివరణ :మన ప్రాధన్యత క్రమం మన పూర్వపు జోన్ లో ఏర్పడిన అన్ని జోన్ లకి ఆప్షన్ ఇవ్వాలి. లేనిచో అపోయింటింగ్ అథారిటీ నిబంధనల క్రమం జోన్ కేటాయింపు చేస్తారు.

సందేహం : నేను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా లొనే ఉండాలి అనుకుంటున్నాను, నేను ఆప్షన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం ఉందా?

వివరణ : కచ్చితంగా ఇవ్వాల్సిందే.. కొత్త లోకల్ క్యాడర్ ప్రకారం అలట్మెంట్ అయ్యేవరకు మనం ప్రస్తుతం పని చేస్తున్న లోకల్ క్యాడర్ కి శాశ్వత ఉద్యోగులం కాదు.

సందేహం : నేను పాత జోనల్ విధానం లో 5 వ జోన్ ఉద్యోగిని, ప్రస్తుతం ఆప్షన్ ఫారం లో నాకు ఇష్టమైన జిల్లాలు ఇవ్వవొచ్చ?

వివరణ : కేవలం జోన్ లు మాత్రమే ఆప్షన్ ఇవ్వవలెను.

సందేహం : జోనల్ అలట్మెంట్ లో వికలాంగులకు అందరికి ప్రాధాన్యత ఉంటుందా ?

వివరణ : అందరికి ఉండదు. వైకల్యం 70% కి పైన ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత. సంబంధిత పత్రాలు ఆప్షన్ ఫారం తో జత పరచ వలసి ఉంటుంది.

సందేహం : జోన్ అలట్మెంట్ లో spouse కేటగిరీ వారికి ప్రాధాన్యత ఉంటుందా?

వివరణ : అలట్మెంట్ కి ప్రాధాన్యత ఉండదు. కేటాయింపు తరువాత మార్చుకునే అవకాశం ఉంది. ఒక వేళ భార్య భర్తలు భిన్న జోన్లు కేటాయింపబడినపుడు ఒకే జోన్ కావాలి అనుకుంటే ప్రత్యేక కార్యదర్శి కి అర్జీ పెట్టుకొనవలెను. ఖాళీలను బట్టి ఇద్దరికి ఒకే జోన్ కేటాయించే అవకాశం ఉంటుంది.

సందేహం : నేను పాత జోనల్ విధానం లో ఆరవ జోన్ ఉద్యోగిని. ప్రస్తుతం మల్టి జోన్ 1 లోని జోన్ 3 (రాజన్న) జోన్ కి ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : ఇవ్వవొచ్చు. కానీ రాజన్న జోన్ లోని మెదక్, కామారెడ్డి, సిద్దిపేట ( కరీంనగర్, వరంగల్ నుండి కలిపిన మండలాలు తక్కితే) జిల్లాలోని పోస్టులకు మాత్రమే అర్హత ఉంటుంది. రాజన్న జోన్ లోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకి మరియు సిద్దిపేట జిల్లాలోని కరీంనగర్, వరంగల్ నుండి కలిపిన మండలాలు పోస్టులకి అర్హత ఉండదు.

సందేహం : నేను 5 వ జోన్ ఉద్యోగిని, ఆప్షన్ ఫారం లో ప్రాధాన్యత లు మొదటి ప్రాధాన్యత జోన్ 3 (కరీంనగర్ జిల్లా) రెండవ ప్రాధాన్యత జోన్ 1 (పెద్దపల్లి జిల్లా) మూడవ ప్రాధాన్యత జోన్ 3 (సిరిసిల్ల జిల్లా) ఇ విదంగా ఇవ్వవొచ్చ?

వివరణ: ఇవ్వకూడదు. ఒక జోన్ ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఆ జోన్ లో అన్ని జిల్లాల్లో పనిచేయడానికి సిద్ధం అని అర్థం.

సందేహం: సస్పెన్షన్, లీవ్ లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవల్సిందేనా?

వివరణ : ఇవ్వవలెను.

సందేహం : డెప్యూటషన్ లేదా ఫారిన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వవొచ్చ?

వివరణ : ఆప్షన్ ఫారం ఇవ్వవలెను.

సందేహం : క్యాడర్ స్ట్రేంత్ కన్న ఎక్కువగా ఉన్న ఉద్యోగుల కేటేయింపు కి ప్రాతిపదిక ఏమిటి?

వివరణ: ఈ అంశం పైన ప్రస్తుత జి.ఓ. లో ఎలాంటి వివరణ లేదు.

సందేహం : HOD లో ఏ ప్రాంత ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వొచ్చు.

వివరణ : HOD కి ప్రత్యేక ఆప్షన్ ఎమీ లేదు. Hod లోని పోస్టులు నూతన జోనల్ విధానం ప్రకారం ఒక్కో జోన్ కి కేటాయింపులు చేసి ఆయా జోన్ లకి జమ చేయబడతాయి.

సందేహం : కొత్త జోనల్ విధానం లో సీనియారిటీ ఎలా లెక్కిస్తారు.

వివరణ : ప్రస్తుత జి. ఓ లో ఈ అంశంలో ఎలాంటి వివరణ లేదు.

సందేహం : ఒక వేళ నేను ప్రస్తుతం పనిచేస్తున్న జోన్ కె కేటాయింప బడితే ప్రస్తుతం పనిచేస్తున్న మండలం/డివిజన్/జిల్లా కార్యాలయం లొనే ఉండవచ్చా?

వివరణ: బదిలీలకు సంబంధించిన ప్రస్తావన ఈ జి.ఓ లో లేదు. కొనసాగింపుగా తరువాతి ఉత్తర్వులలో వివరణ ఉండవచ్చు.

సందేహం : ఒక జోన్ పరిధిలో సాంక్షన్ పోస్ట్స్ అన్ని కూడా కేటేయింపు కొరకు పరిగణలోకి తీసుకుంటారా?

వివరణ: తీసుకోరు. ఒక జోన్ పరిధిలో సాంక్షన్ పోస్టులు అన్ని కాకుండా పూర్వపు జోన్ లో పనిచేయుచున్న ఉద్యోగుల నిష్పత్తి ఆధారంగా నూతన జోన్ కి కేటాయించిన వర్కింగ్ స్ట్రేంత్ ఆధారంగా కేటాయింపు ఉంటుంది. అనగా ఉదాహరణకు ప్రస్తుతం 5 వ జోన్ లో ఖాళీగా ఉన్న MPSO పోస్టులు 5వ జోన్ పరిధిలోని అన్ని జోన్ లలో సమనంగా ఉండేట్టు చూస్తారు.

సందేహం : ఉద్యోగులు అలట్మెంట్ ఆర్డర్ ఎలా పొందుతారు.

వివరణ : IFMIS వెబ్సైట్ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే అవకాశం ఉంది.

అధికారిక వివరణ కొరకు జి.ఓ 317 చూడండి

ఆకుల రాజు, మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి, కొనరావుపేట మండలం.