IPL 2024 – పోరాడి ఓడిన హైదరాబాద్

BIKKI NEWS (MARCH 23) : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పోరాడి ఓటమి (IPL 2024 SRH KKR MATCH) పాలైంది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతానైట్ రైడర్స్ జట్టు రస్సెల్ (64*), సాల్ట్ (54) విజృంభణతో 208/7 భారీ స్కోర్ ను నమోదు చేసింది. నటరాజన్ – 3, మర్కాండే – 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు క్లాసెన్ (klasse) (63) వీరబాదుడులో గెలుపు వరకు చేరిన చివరి ఓవర్లో క్లాసెన్ ఔట్ కావడంతో 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

చివరి ఓవర్లో 13 రన్స్ అవసరం కాగా అర్షిత్ రాణా బౌలింగ్ చేస్తూ మొదటి బంతికే సిక్స్ ఇచ్చాడు అయిన, ఒత్తిడికి లోనుకాకుండా రెండు వికెట్లు తీసీ కేకేఆర్ కు విజయం అందించాడు.

అంతకు ముందు పంజాబ్ – డిల్లీ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాదించింది.