SAHITYA AKADEMI AWARDS – 2021

BIKKI NEWS : కేంద్ర సాహిత్య అకాడమీ 2021కి గాను 20 భాషల్లో గురువారం అవార్డులు (SAHITYA AKADEMI AWARDS – 2021) ప్రకటించింది. కవితల విభాగంలో తెలుగు కవి గోరటి వెంకన్నకు ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి కి ఈ పురస్కారం లభించింది.

సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2021 తెలుగులో తంగుళ్ల గోపాల్‌కు ఆయన రాసిన కవితల పుస్తకం ‘దండకడియం’కు ఈ అవార్డు దక్కింది.

ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారం తెలుగులో దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి దక్కింది.

కవితల విభాగం ::


1) గోరటి వెంకన్న (తెలుగు)
2) మవాడీ గహాయి(బోడో),
3) సంజీవ్ వెరెంకర్(కొంకణి),
4) హృషీకేశ్ మాలిక్(ఒడియా),
5) మీథేశ్ నిర్మొహీ(రాజస్థానీ),
6) బిందేశ్వరీప్రసాద్ మిశ్ర్(సంస్కృతం),
7) అర్జున్ చావ్లా(సింధి)

కథా రచయితలు ::

1) రాజ్ రాహీ(డోగ్రీ),
2) కిరణ్ గురవ్(మరాఠీ),
3) ఖలీద్ హుసేన్(పంజాబీ),
4) నిరంజన్ హంస్డా (సంతాలీ),
5) అంబాయి(తమిళం)

నవలా రచయితలు ::

1) అనురాధా శర్మ పుజారీ(అస్సామీ),
2) నమితా గోఖలే(ఇంగ్లిష్)

★ జీవిత చరిత్రల విభాగం ::

1) డీఎస్ నాగభూషణ (కన్నడ)

★ స్వీయచరిత్రల విభాగం ::

1) జార్జ్ ఒనక్కూర్ (మళయాలం)

★ నాటక విభాగం :

1) బ్రాత్య బసు (బెంగాలీ)
2) దయా ప్రకాశ్ సిన్హా ( హిందీ)

★ విమర్శ విభాగం ::

1) వాలీ మొహ్మద్ అసీర్ కాస్తవారీ(కశ్మీరీ),

★ ఐతిహాసిక కవిత్వ విభాగం ::

1) చబీలాల్ ఉపాధ్యాయ(నేపాలీ)