హైదరాబాద్ (డిసెంబర్ – 09) : తెలంగాణలో నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక తల్లడిల్లుతున్న ప్రజానీకాన్ని కల్లారా చూసిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపించి తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి తెలంగాణ రాష్ట్ర సాధన జీవిత లక్ష్యంగా భావించి.. అహింసా పద్ధతిలో అనేక ఉద్యమాలు చేసి కేంద్ర అధికార ప్రతిపక్ష పార్టీలను మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని… ఇప్పుడు ఆప్ కిబార్ కిసాన్ సర్కార్ నినాదంతో భారతీయ రాష్ట్ర సమితి(BRS) ఏర్పాటు చేసి దేశానికి దిక్సూచి అవుతాడని కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మైన్, ఇంటర్ విద్యా జేఏసీ కో చైర్మన్ సీహెచ్ కనకచంద్రం తెలిపారు.
ఈ సందర్భంగా కనకచంద్రం మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజల కష్టసుఖాలను కల్లారా చూసిన వ్యక్తి గనుక తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ అనే కుటుంబానికి పెద్దకొడుకయ్యాడు. అపర భగీరథుడులా నీళ్లను తెలంగాణలో ప్రవహింపజేశాడు అనేక నిధులను వెచ్చించి విద్య, వైద్య రంగాలతో పాటు అనేక రంగాలలో నూతన ఒరవవడులను సృష్టించాడు. నిరుద్యోగ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వారి జీవితాల్లో వెలుగును నింపబోతున్నారు.
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రజల సమస్యల నుండి పుట్టిన వ్యక్తి కనుక ప్రజామోదకరమైన పరిపాలన కొనసాగించాడు. పక్క రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి మా రాష్ట్రంలో ఉంటే బాగుండు కదా అనుకునే తరుణంలో భారత రాష్ట్ర సమితిని (BRS) ఏర్పాటు చేయడం భారతదేశ ప్రజలకు ఇది శుభ పరిణామం. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత కరెంటు, కెసిఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు పుట్టిన నుండి పెళ్లయి నంతవరకు పెద్దన్నగా చనిపోయేంతవరకు కొడుకుగా తెలంగాణకే పెద్ద దిక్కైనాడు. పేదలకు అందని విద్యను అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పేరిట పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను విదేశీ విద్యను అందిస్తున్న విజ్ఞాన జ్యోతి కెసిఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇవ్వడం ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు వేలల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అయ్యాడు.
ఇలాంటి పథకాలను భారతదేశంలో ప్రవేశపెట్టి భారత ప్రజల కన్నీటి బాధలను తొలగించాలని భారత ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలు బాగుపడాలని తెలంగాణ ప్రజల కోరిక.. కేసీఆర్ గారు మరో అంబేద్కర్ అయి భారత ప్రజల ఆకాంక్షలను తీరుస్తారని ఆశిస్తూ.. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తూ.. సంతోషిస్తున్నాం అని తెలిపారు.