TSPSC భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాలు

హైదరాబాద్ (నవంబర్ – 30) : తెలంగాణ భూగర్భ జలవనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.

గెజిటెడ్ పోస్టులకు డిసెంబర్ 6 నుంచి 27 వరకు, నాన్ గెజిటెడ్ పోస్టులకు డిసెంబర్ 7 నుంచి 28 వరకు అభ్యర్థులు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు 200 రూపాయలు. పరీక్ష తేదీ 2023 మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉండనుంది.

అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/