BIKKI NEWS (DEC.27) : ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్- వివిధ కేటగిరీలలో 291 పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను (jobs in income tax department) ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలు:
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా – పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్,
బాస్కెట్ బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్,
ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు
సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు గడువు : జనవరి 19 – 2024.
వయోపరిమితి: జనవరి 01-2023 నాటికి పోస్టును అనుసరించి 18 – 30 ఏళ్లు, 18-27 ఏళ్లు. 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.18,000/-., రూ.25,500/-. రూ. 44,900/- వరకు చెల్లిస్తారు.