BIKKI NEWS (FEB. 04) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను (jaya jayahe telangana song) తెలంగాణ గేయంగా ప్రకటించింది.
తెలంగాణ ఆత్మకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచిన ఈ గేయం తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు పాట రూపంలో ఉందని, అందుకే ఈ గేయాన్ని తెలంగాణ గేయంగా ప్రకటించినట్లు మంత్రివర్గ సభ్యులు తెలిపారు.
జయజయహే తెలంగాణ.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్ జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి తరుగనిదీ నీత్యాగం మరువనదీ శ్రమ యాగం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ ఎద జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి జై తెలంగాణ! జైజై తెలంగాణ! జై తెలంగాణ!! జైజై తెలంగాణ!!
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER