JAM 2024 NOTIFICATION

హైదరాబాద్ (ఆగస్టు -08) : దేశ వ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ- పీహెచ్డీ (డ్యూయల్ డిగ్రీ) కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే JOINT ADMISSION TEST FOR MASTERS (JAM-2024) కు సెప్టెంబరు 5వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబరు 13వ తేదీగా నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.

2024 ఫిబ్రవరి 11వ తేదీన పరీక్ష జరుగుతుంది. మొత్తం మూడు వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ లో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రంలో 105 సీట్లను జామ్ ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. ఐఐటీ తిరుపతిలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, ఎమ్మెస్సీ గణితం – స్టాటిస్టిక్స్, ఎం. ఏ గణితం- స్టాటిస్టిక్స్ మొత్తం 60 సీట్లున్నాయి.

జామ్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, కొన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రవేశాలు కల్పిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : ఏపీ: విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, ఒంగోలు, తిరుపతి.
తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

◆ వెబ్సైట్ : https://jam.iitm.ac.in/