BIKKI NEWS (MARCH 22) : IPL 2025. ఐపీఎల్ – 2025 18వ సీజన్ నేటి నుండి ప్రారంభం కానుంది. 2008లో మొదటిసారి నిర్వహించిన ఐపీఎల్ ఈ సంవత్సరంతో 18 వసంతాలు పూర్తి చేసుకోనుంది.
IPL 2025
తొలి పోరులో నేడు డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ (RCB) తో తలపడనుంది.
ఈ సీజన్లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 73 మ్యాచ్ లను ఈ సీజన్ లో నిర్వహించనున్నారు.
మార్చి 22న తొలి మ్యాచ్, మే 25న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
2025 ఐపీఎల్ విశేషాలు
ఐపీఎల్ ప్రదర్శనను బట్టి ఈ సంవత్సరం పది టీములను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూపు ఏ లో చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా…
గ్రూపు బీ లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గుజరాత్ ఉన్నాయి.
ప్రతి టీమ్ తన గ్రూపులో ఉన్న మిగతా నాలుగు జట్లతో రెండు మ్యాచ్ ల చొప్పున మొత్తం ఎనిమిది మ్యాచ్ లను ఆడనుంది. అలాగే మరో గ్రూపులో ఒక జట్టుతో రెండు మ్యాచ్ లను, మిగతా నాలుగు టీమ్ లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. దీంతో ప్రతి టీమ్ 14 మ్యాచులు ఆడనుంది.
అన్ని మ్యాచ్ లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. రెండు మ్యాచ్ లు ఉన్న సందర్భాల్లో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 4th JULY