UGC : డిగ్రీలో ఇంటర్షిప్ తప్పనిసరి

హైదరాబాద్ (అక్టోబర్ – 11) : డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులకు ఇక నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి (internship compulsory in bachelor degree say UGC). మూడు, నాలుగేండ్ల డిగ్రీ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ తర్వాత 60 నుంచి 120 గంటల పాటు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ పనిచేయాల్సి ఉంటుంది. ఇక నాలుగేండ్ల డిగ్రీ (రిసెర్చ్) విద్యార్థులైతే ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ చేయాలి. ఇందుకు క్రెడిట్స్ జారీ చేస్తారు.

డిగ్రీలో ఇంటర్న్షిప్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆయా మార్గదర్శకాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది.

ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం.. 2022లో 88.6శాతం విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం వెతుకుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో యూజీసీ.. డిగ్రీలో ఇంటర్నేషను తప్పనిసరి చేసింది.

◆ UGC మార్గదర్శకాలు

విద్యార్థులు ఇంటర్న్షిప్ లో భాగంగా ట్రైనింగ్, షార్టర్ రిసెర్చ్ ప్రాజెక్ట్, సెమినార్,ఎంటర్ప్రైజ్ లు, రైతులు, సోషల్ ప్రాజెక్ట్లు, అంత్రపెన్యూర్స్ విజయాలను అధ్యయనం చేయాలి. ఇందుకు 2 నుంచి 4 క్రెడిట్లు జారీచేస్తారు.

స్టార్టప్లు, సంబంధిత సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. కొంతమంది విద్యార్థి బృందానికి ఇంటర్న్షిప్ సూపర్వైజర్, మెంటార్లు మార్గదర్శనం చేస్తారు.

నాలుగేండ్ల డిగ్రీ (ఆనర్స్ విత్ రిసెర్చ్) లో విద్యార్థులకు 8వ సెమిస్టర్ అంతా ఇంటర్న్షిప్ ను అమలుచేస్తారు. థీసిస్, ప్రాజెక్ట్ వర్క్, రిసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్స్ ను రూపొందించాలి. ఇందుకు 8 నుంచి 12 క్రెడిట్లు జారీచేస్తారు.