NURSES DAY : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

BIKKI NEWS (MAY 12) : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (NURSES DAY) ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏట మే 12న నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తుచేసుకుంటారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌’ సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.

ఈ రోజున, నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రము, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రోగులకు వారందిస్తున సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూ, నర్సింగ్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం ద్వారా, దేశాలు వారి దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధికి మద్దతు వంటి మూడు ప్రభావాలను దేశాలు సాధించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ప్రస్తుతం నర్సులు అంటువ్యాధులనే మహమ్మారులతో పోరాడటంలో ముందంజలో ఉన్నారు. వారు నాణ్యత, గౌరవప్రదమైన చికిత్స, సంరక్షణను అందిస్తారు.

ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తలలో సగానికి పైగా నర్సులు ఉన్నారు, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత ఉంది, ఇంకా 5.9 మిలియన్ల మంది నర్సులు అవసరం ఉందని, ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ కొరత ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నర్సులు పోషించే కీలక పాత్ర, అందించిన సేవలు ప్రపంచ ప్రజలఅందరికి తెలుసు. నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా,లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్యమును ప్రపంచ దేశాలు సాధించలేవు. ఇందుకు అనుగుణంగా అన్ని దేశాలలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలందరికి వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, ముఖ్యంగా, వ్యక్తిగత రక్షణ పరికరాలకు అంతరాయం లేకుండా వారు సురక్షితంగా సంరక్షణ ఉండతోనే వారు రోగులకు సేవలను అందించగలరు, దీనితో అంటువ్యాధులను తగ్గించవచ్చు.

నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ మానసిక ఆరోగ్య మద్దతు, సకాలంలో వేతనం, అనారోగ్య సెలవులు, భీమా వంటివి ఇవ్వడం, అన్ని ఆరోగ్య అవసరాలకు ప్రతిస్పందించడానికి అవసరమైన తాజా జ్ఞానం ఇవ్వడం అన్ని దేశాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది.