INTER SUPPLEMENTARY EXAMS – ఏర్పాట్లు పూర్తి

BIKKI NEWS (MAY 24) : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు (INTER SUPPLEMENTARY EXAMS 2024) బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 926 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎందుకు సంబంధించిన అధికారులను నియమించినట్లు పేర్కొంది.

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రథమ సంవత్సరంలో 2,73,407 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,53,608 మంది చొప్పున మొత్తం 4,27,015 మంది విద్యార్థులు హజరుకానున్నారు.

హాల్ టికెట్లను ఇప్పటికే కాలేజీ లాగిన్ లో మరియు విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకుని వచ్చిన హాల్ టికెట్లతో కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులను బోర్డు సూచించిన విషయం తెలిసిందే.