ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాలి – TGJLA

BIKKI NEWS (MAY 20) : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పబ్లిక్ పరీక్షలు విధులు నిర్వహించిన వారికి వెంటనే రెమ్యునరేషన్ మరియు పెండింగ్ రెమ్యునరేషన్ చెల్లించాలని (inter board exams remuneration) ఈరోజు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీమతి శృతి ఓజా గారికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

2024 పబ్లిక్ పరీక్షలు నిర్వహించి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ, పరీక్షలు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, మరియు ఇన్విజిలేటర్ మరియు ఇతర విధులు నిర్వహించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి కూడా తెలంగాణ ఇంటర్ బోర్డ్ రెమ్యూనరేషన్ చెల్లించలేదని, దీనివల్ల విధులు నిర్వహించిన వందల మంది అధ్యాపకులు మరియు ఇతర విధులు నిర్వహించిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గతంలో లాగా ఇంటర్ పరీక్షలలో వివిధ స్థాయిలలో నిర్వహించిన వారికి పరీక్షల ముగింపు అనంతరం వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని గౌరవ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. అ

దేవిధంగా ఈ విషయంపై తెలంగాణ ఇంటర్ బోర్డు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీమతి జయప్రద భాయ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, వారు కూడా ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో వివిధ విధులు నిర్వహించిన వారికి రెమ్యునరేషన్ త్వరగా చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నమని తెలిపారని సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ తో పాటు రాష్ట్ర మహిళా కార్యదర్శి సంగీత, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెపి శోభన్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేపల్లి పూర్ణచందర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుమ్మడి మల్లయ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి సత్యనారాయణ , నరేండ్ల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.