INDvsAFG : భారత్ ఘనవిజయం

డిల్లీ (అక్టోబర్ – 11) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు డిల్లీ వేదికగా భారత్ – అప్ఘనిస్తాన్ మద్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 273 పరుగుల లక్ష్యం ఇవ్వగా భారత్ 35 ఓవర్లలోనే చేదించింది ్

అప్ఘనిస్తాన్ బ్యాటింగ్ లో కెప్టెన్ షాహిద్ – 80, ఓమర్జాయ్ – 62 పరుగులతో రాణించడంతో 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 4, హర్దిక్ పాండ్యా 2 , కులదీప్, ఠాకూర్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రోహిత్ సెంచరీ (131) తో లక్ష్యం వైపు దూసుకుపోతుంది. ఇది రోహిత్ శర్మ కు ప్రపంచ కప్ లో 7 వ సెంచరీ. ప్రపంచ కప్ లో అత్యదిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (6) పేరు మీద ఉన్న రికార్డును అదిగమించి నూతన రికార్డు సృష్టించాడు. అలాగే వేగవంతమైన (63బంతుల్లో) వరల్డ్ కప్ సెంచరీ సాదించిన భాలత ఆటగాడిగా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మరోవైపు ఇషాన్ కిషన్ (47), పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లీ 55 పరుగులతో లాంఛనం పూర్తి చేశాడు.