PARLIAMENT BUILDING – చరిత్రలో పార్లమెంట్ భవనం

BIKKI NEWS : indian parliament buildings history. భారతదేశ పార్లమెంట్ ప్రజాస్వామ్య నిలువెత్తు రూపం… ఇప్పుడు పాత పార్లమెంట్ భవనం స్థానంలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరుపుకొని ప్రజాస్వామ్య చర్చలకు, విలువలకు నిలువుటద్దంగా నిలవనుంది. పోటీ పరీక్షల నేపథ్యంలో చరిత్రలో పార్లమెంట్ భవనం విశిష్టతలను సంక్షిప్తంగా చూద్దాం…

INDIAN PARLIAMENT BUILDINGS HISTORY

1921 ఫిబ్రవరి 12 : కౌన్సిల్ హౌస్ గా పిలిచే పార్లమెంటు హౌసు శంకుస్థాపన

1927 జనవరి 18 : పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్

1927 జనవరి 19 : పార్లమెంటు సముదాయంలో ‘సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ’ మూడో విడత తొలి సమావేశం

1946 డిసెంబరు 9 : రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం

1947 ఆగస్టు 14/ 15 : రాజ్యాంగ పరిషత్తు అర్ధరాత్రి సమావేశంలో బ్రిటిషర్ల నుంచి అధికారాల బదిలీ

1952 మే 13 : ఉభయ సభల తొలి సమావేశాలు

1970 ఆగస్టు 3 : పార్లమెంటు అనుబంధ భవనానికి పునాది వేసిన అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి

1975 అక్టోబరు 24 : ఈ అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధాని ఇంది రాగాంధీ ప్రారంభించారు.

1987 ఆగస్టు 15 : పార్లమెంటు గ్రంథాలయానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శంకుస్థాపన

2002 మే 7 : పార్లమెంటు గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్

2009 మే 5 : మరో అనుబంధ భవనానికి అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, అప్పటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ శంకుస్థాపన

2017 జులై 31: పార్లమెంటు అనుబంధ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

2019 ఆగస్టు 5 : అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఉపరాష్ట్రపతి హోదాలో ఎం. వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సమర్పించారు.

2020 డిసెంబరు 10 : కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన

2023 మే 28: మోదీ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు