Home > CURRENT AFFAIRS > IFTAR – ఇఫ్తార్ విందుకు UNESCO గుర్తింపు

IFTAR – ఇఫ్తార్ విందుకు UNESCO గుర్తింపు

BIKKI NEWS (DEC – 11) : రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో హెరిటేజ్ (iftar got world heritage identity by UNESCO)గుర్తింపు లభించింది.

ఇరాన్, టర్కీ,అజర్ బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ఈ ప్రతిపాదనను యూనెస్కో ఆమోదించింది.

రంజాన్ మాసంలో ఉపవాసం తర్వాత సాయంత్రం వేళలో ఇచ్చే ఈ విందు వల్ల కుటుంబం, సామాజిక సంబంధాలు బలోపేతమవుతాయని, దాతృత్వం, సంఘీభావం, సాంఘిక మార్పిడిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరిస్తారని, సాంఘిక విలువలు పెంపొందుతాయని వివరించింది.