FREE COACHING – బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌-1కు ఉచిత కోచింగ్‌

BIKKI NEWS (MARCH 05) : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి ఉచిత శిక్షణ (group 1 free coaching by bc study circle) అందించనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డీ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

సైదాబాద్‌ లక్ష్మీనగర్‌ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ శిక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹ 5లక్షలు మించని అభ్యర్థులు మార్చి 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్‌ ప్రకారం ఉచిత కోచింగ్‌కు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 040-24071178, 27077929 నంబర్ల ద్వారా తమను సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ : https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do