GHI – 2022 : ఆకలి సూచీలో అట్టడుగున భారత్

హైదరాబాద్ (అక్టోబర్ – 16) : Global Hunger Index – 2022 (GHI – 2022)… ప్రపంచ ఆకలి సూచిక 2022 లో 121 దేశాలకు గానూ భారత్ 107వ స్థానంలో నిలిచింది. 2021లో 101వ స్థానంలో ఉంది. మన చుట్టు పక్కల దేశాలలో ఒక్క అఫ్ఘనిస్తాన్ తప్ప అన్ని దేశాలు మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం విశేషం.

పోషకాహార లోపంతో 5 ఏళ్ళ లోపం పిల్లలో ఎదుగుదల లేకపోవడమనే విభాగంలో భారత్ 19.3శాతంతో మొదటి స్థానంలో ఉంది.

ఈ GHI తయారీకి పిల్లలో పోషకాహారం లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, ఎదుగుదల లోపం, శిశుమరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

భారత్ GHI స్కోర్ 29.1 పాయింట్లు సాధించి భారత్ లో ఆకలి “అత్యంత తీవ్రమైన స్థితి”లో నిలిచింది 2014లో 55వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రస్తుతం 107వ స్థానంలో నిలవడం ఆందోళనకరం.

తొలి స్థానాలలో నిలిచిన దేశాలు బెలారస్, బోస్నియా, చిలీ, చైనా, క్రోయోషియా, ఎస్తోనియా, హంగేరి, కువైట్ లు నిలిచాయి.

చివరి స్థానాలలో నిలిచిన దేశాలు బురుండి‌ సౌత్ సూడాన్, సిరియా, యెమెన్, సోమాలియా దేశాలు నిలిచాయి.

మన పొరుగు దేశాలలో శ్రీలంక (64), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99), అప్ఘనిస్తాన్ (109) స్థానాలలో నిలిచాయి.

భారత్ స్థానాలు :

2022 – 107
2021 – 101
2020 – 94
2019 – 102
2018 – 103
2017 – 100
2016 – 97
2015 – 80
2014 – 55

◆ వెబ్సైట్ : https://www.globalhungerindex.org/india.html