FREE COACHING – ఉచిత వసతితో సివిల్స్ కోచింగ్ కు శిక్షణ

BIKKI NEWS (JUNE 13) : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు 2025 కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత వసతితో శిక్షణ కొరకు దరఖాస్తులు (free civils 2025 coaching in tg study circles) ఆహ్వానిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.

free civils 2025 coaching in tg study circles

దరఖాస్తు గడువు : జూన్ 13 నుంచి జూలై 07 లోపు కలదు. ఆన్‌లైన్‌ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు : విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలు మించకూడదు.

వయోపరిమితి : 21 ఏళ్ళు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆప్టిట్యూడ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నారు.

సౌకర్యాలు :

ఉచిత వసతి, భోజనం.
8,000/- రూపాయల విలువ చేసే పుస్తకాల పంపిణీ.
లైబ్రరీ సౌకర్యం కలదు.
కంప్యూటర్ ల్యాబ్ లు కలవు.
నెలకు పాకెట్ మనీ 750/ (బాయ్స్), 1,000/- (గర్ల్స్) ఇవ్వబడును.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు