NEET FREE COACHING – గురుకులాల్లో నీట్ ఉచిత లాంగ్ టెర్మ్ కోచింగ్

BIKKI NEWS (JUNE 15) : FREE LONG TERM NEET COACHING IN TGSWREIS. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఉచిత నీట్ లాంగ్ టెర్మ్ శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

2024 – 25 విద్యా సంవత్సరంలో ఈ నీట్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణను వివిధ కేంద్రాలలో గురుకుల విద్యాలయ సంస్థ అందించనుంది.

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండి మరియు నీట్ 2024 పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి.

తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000/- మరియు పట్టణ ప్రాంతాలలో 2,00,000/- లోపల ఉండాలి.

శిక్షణ కేంద్రాలు : TGSWR COE – గౌలిదొడ్డి (బాయ్స్), గౌలిదొడ్డి (గర్స్) నార్సింగి, చిలుకూరు, మహేంద్ర హల్స్

సీట్ల వివరాలు : SC – 334, BC – 08, OC – 08

దరఖాస్తు ఫీజు : 200/- రూపాయలు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో చేసుకోవాలి

అవసరమైన డాక్యుమెంట్లు :

  • NEET 2024 SCORE CARD
  • కుల దృవీకరణ పత్రం
  • ఆదాయ దృవీకరణ పత్రం
  • పదో తరగతి మెమో
  • ఇంటర్మీడియట్ మెమో
  • పాస్పోర్ట్ సైజ్ పోటోలు – 4

తరగతులు జూలై – 01 నుండి ప్రారంభమవుతాయి.

దరఖాస్తు గడువు : జూన్ – 15 నుండి జూన్ 24 – 2024 వరకు కలదు

ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా జూన్ 26 వ తేదీన తెలియజేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూన్ 28వ తేదీన నిర్వహించనున్నారు.

FREE LONG TERM NEET COACHING IN TGSWREIS

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://kishoremamilla-001-site2.itempurl.com/start.html

LATEST CURRENT AFFAIRS