హైదరాబాద్, (జూలై – 22): తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (TSPSC – Food Safety Officer) జారీ చేస్తూ టీఎసీపీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి వివరాలకు www.tspsc.gov.in
కాగా, ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యారోగ్య శాఖలతో పాటు ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.