BIKKI NEWS : ఫైనాన్స్ కమీషన్ (FINANCE COMMISSION) అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతిచే కాలానుగుణంగా భారత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను నిర్వచించడానికి, పన్నుల పంపకాలు చేపట్టడానికి ఏర్పాటు చేయబడినది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.
కేంద్రం తాజాగా 16వ ఆర్థిక సంఘాన్ని అరవింద్ పనగారియా నేతృత్వంలో (16th finance commission) ఏర్పాటు చేసింది. దీని కాలం 2025 – 2030 వరకు ఉంటుంది. ఈ కమిషన్ లో పూర్తి కాల సభ్యులు గా అజయ్ నారాయణ్ ఘా, యానీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండాలను నియమించింది. సౌమ్య కాంతి ఘోష్ ను పార్ట్‌టైమ్ సభ్యురాలిగా నియమించారు.
ప్రస్తుతం 15 వ ఆర్థిక సంఘం (15th finance commission) అమలులో ఉంది. దీని చైర్మన్ ఎన్.కే. సింగ్. మరియు పూర్తికాల సభ్యులు అజయ్ నారాయణ్ ఝా , అశోక్ లాహిరి మరియు అనూప్ సింగ్. , కమిషన్‌లో పార్ట్‌టైమ్ సభ్యుడిగా రమేష్ చంద్ కూడా ఉన్నారు. శక్తికాంత దాస్ నవంబర్ 2017 నుండి డిసెంబర్ 2018 వరకు కమిషన్ సభ్యునిగా పనిచేశారు.
LIST OF FINANCE COMMISSIONERS
ఆర్థిక సంఘం – 01 :- (1951) కేసీ నియోగి 1952–57
ఆర్థిక సంఘం – 02 :- (1956) కె. సంతానం 1957–62
ఆర్థిక సంఘం – 03 :- (1960) ఎకె చందా 1962–66
ఆర్థిక సంఘం – 04 :- (1968) పివి రాజమన్నార్ 1966–69
ఆర్థిక సంఘం – 05 :- (1964) మహావీర్ త్యాగి 1969–74
ఆర్థిక సంఘం – 06 :- (1972) కె. బ్రహ్మానంద రెడ్డి 1974–79
ఆర్థిక సంఘం – 07 :- (1977 ) జేయమ్ షెలాట్ 1979–84
ఆర్థిక సంఘం – 08 :- (1983) వైబీ చవాన్ 1984–89
ఆర్థిక సంఘం – 09 :- (1987) ఎన్.కే.పి. సాల్వే 1989–95
ఆర్థిక సంఘం – 10 :- (1992) కేసీ పంత్ 1995–00
ఆర్థిక సంఘం – 11 :- (1998) ఏమ్ ఖుస్రో 2000–05
ఆర్థిక సంఘం – 12 :- (2002) సి. రంగరాజన్ 2005–10
ఆర్థిక సంఘం – 13 :- (2007) డా. విజయ్ ఎల్. కేల్కర్ 2010–15
ఆర్థిక సంఘం – 14 :- (2013) డాక్టర్ వై వి రెడ్డి 2015–20
ఆర్థిక సంఘం – 15 :- (2017) ఎన్.కే. సింగ్ 2020–25
ఆర్ధిక సంఘం -16 :- (2024) అరవింద్ పనగారియా.(2025 – 2030)