పదోన్నతి పై వెళ్లిన తహసిల్దార్ హరిప్రసాద్ సేవలు అభినందనీయం

BIKKI NEWS (SEP. 28) : facilitation to mro hari prasad. ఈ రోజు జనగామ జిల్లా ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ కోశాధికారి ఇట్టబోయిన శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో జనగాం జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ శ్రీ కాజా షరీఫ్ గారు మాట్లాచు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికి జనగామ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో క్రింది సాయి ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తేనే జిల్లాకి మంచి పేరు వస్తుందని తెలియజేశారు.

facilitation to mro hari prasad

రెవెన్యూ ఫోరం అధ్యక్షులుగా చాలా కాలం నుండి జనగామ జిల్లాలో డిప్యూటీ తాసిల్దారుగా పనిచేసి ప్రమోషన్ పొంది సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం తహసిల్దార్ గా వెళ్లిన బాశెట్టి హరిప్రసాద్ గారు రెడ్ క్రాస్ సొసైటీలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటిసారిగా ఎన్నికై ఆనాటి నుండి నేటి వరకు రెడ్ క్రాస్లో పనిచేయడం, వారి సొంత గ్రామానికి సొంత మండలంలో అనేక పేద ప్రజలకి లైన్స్ క్లబ్ ద్వారా సేవలు సేవలందించడం అభినందనీయమని వారి ఉద్దేశించి కొనియాడారు.

ఇట్టి కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన మరొక తహసిల్దార్ మోసిన్ గారు రఘునాథపల్లి మండలాలలో మంచిగా సేవలందించి రెవెన్యూ వ్యవస్థ కి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

అనంతరం ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అడిషనల్ కలెక్టర్ శ్రీ పింకీస్ కుమార్ ఐఏఎస్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్ల కన్నా రెవెన్యూ సేవలు అత్యంత మెరుగైనవని ప్రతి శాఖ ప్రతి డిపార్ట్మెంట్ వారి వారి శాఖలకే పరిమితం అయితే కేవలం రెవెన్యూ వ్యవస్థ మాత్రం అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలని పర్యవేక్షణ చేస్తుందని రెవెన్యూ వ్యవస్థ గొప్పదని కొనియాడారు.

అనంతరం హరి ప్రసాద్ గారికి దయానంద్ గారికి మోసిన్ గారికి జిల్లా జేఏసీ చైర్మన్ ఖాజా షరీఫ్ గారు అడిషనల్ కలెక్టర్ పెంకేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

ఇట్టి కార్యక్రమంలో రెవెన్యూ ఫోరమ్ కోశాధికారి ఇట్టబోయిన శ్రీనివాస్, AO రవీందర్ సార్ , టీఎన్జీవో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, కోశాధికారి యండి హాఫిజ్, ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, రాంనర్సయ్య, ఉప్పలయ్య, ప్రభాకర్, శ్రీధర్ బాబు, కృష్ణ, రాజు, లచ్చు నాయక్, మౌనిక, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD