ENGLISH PRACTICALS : ఇంటర్ లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ సిలబస్ రూపకల్పన

హైదరాబాద్ (జూన్ – 21) : ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలను (intermediate english practicals) ప్రవేశపెట్టడానికి చర్యలను ఇంటర్మీడియట్ బోర్డ్ తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి 11 మంది నిపుణులతో కూడిన బృందం ఈరోజు ప్రాక్టికల్ సిలబస్ ను ఖరారు చేయనుంది. ఇంగ్లీష్ థియరీ పరీక్ష 80 మార్కులకు, ప్రాక్టికల్ పరీక్షలు 20 మార్కులకు ఉండనున్నాయి. దీనికోసం ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు సిలబస్ ను కుదించనున్నారు.

★ ఇంగ్లీష్ మాట్లాడేలా చేసే ప్రాక్టికల్స్

ఇంటర్ పూర్తయ్యే లోగా ఇంగ్లీషులో మాట్లాడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దటమే ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ప్రథమ లక్ష్యం.

కళాశాలలో ప్రత్యేకమైన ఇంగ్లీష్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి అందుకు ప్రత్యేక పిరియడ్ నూ కేటాయించనున్నారు

ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ లో రాయడం, చదవడం, వినడం, ఉచ్చరించడం పై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. ఫోనెటిక్స్ పై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు.