వివిధ రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం స్వీకరించిన అంశాలు

భారత రాజ్యాంగానికి అతి ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం 1935. అప్పటి ప్రపంచ రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను, ఉత్తమ లక్షణాలను మన దేశానికి అనుగుణమైన మార్పులతో స్వీకరించారు. అందులో ముఖ్యమైనవి…

★ బ్రిటిష్ రాజ్యాంగం :- క్యాబినెట్ తరహా పాలన పద్ధతి, సమన్యాయ పాలన, శాసన నిర్మాణాల ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్, అటార్నీ జనరల్ మొదలైన పదవులు, రిట్లు జారీ చేసే విధానం.

★ అమెరికా రాజ్యాంగం :- ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి పదవి, రాష్ట్రపతిని తొలగించే మాహాభియోగ తీర్మానం.

★ కెనడా రాజ్యాంగం :- బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్లను నియమించే పద్ధతి, అవశిష్టాధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహాను కోరడం.

★ ఐర్లాండ్ రాజ్యాంగం :- ఆదేశిక సూత్రాలు, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రాజ్యసభ విశిష్ట సభ్యుల నియామకం

★ వైమార్ జర్మనీ :- జాతీయ అత్యవసర పరిస్థితి. ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారం మొదలైనవి.

★ ఆస్ట్రేలియా :- ఉమ్మడి జాబితా. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం (బిల్లు ఆమోదంలో వివాదం ఏర్పడిన సందర్భాల్లో), వాణిజ్య, వ్యాపార లావాదేవీలు. అంతర్రాష్ట్ర వ్యాపారం

★దక్షిణాఫ్రికా :- రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి.

★ ఫ్రాన్స్ :- గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం

★ రష్యా :- ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు

★ జపాన్ :- నిబంధన 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి

★ 1935 చట్టం :- కేంద్రం, రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతి సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356), గవర్నర్ విచక్షణాధికారాలు.

Follow Us @