DAILY G.K. BITS IN TELUGU MARCH 25th

DAILY G.K. BITS IN TELUGU MARCH 25th

1) భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ క్లీన్ మనీ

2) భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి

3) భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి వివరిస్తుంది .?
జ : ఆర్టికల్ 47

4) భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభలో మాత్రమే

5) భారత జాతీయ గీతం ఆలపించడం పూర్తి చేయాల్సిన సరైన సమయం ఏమిటి.?
జ : 52 సెకండ్లు

6) ఏ కేసులో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించింది.*
జ : గోలక్ నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం

7) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండల్ లో మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సీట్లలో 15 శాతానికి మించరాదు.?
జ : 91 వ రాజ్యాంగ సవరణ

8) ఓజోన్ పొరను 1913లో కనుగొన్నది ఎవరు?
జ : చార్లెస్ బాబ్రీ ఎండ్రీ బూయిసన్

9) రెండో ప్రపంచ యుద్ధంలో కనుగొన్న ఏ రసాయానికి పదార్థం మలేరియా ఇతర కీటక వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడింది కానీ దీనిని ఇటీవల నిషేధించారు.?
జ : డైక్లోరో డై ఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ (DDT)

10) డ్రై ఐస్ అని దేనిని అంటారు.?
జ : ఘన కార్బన్ డయాక్సైడ్

11) సోడా ద్రావణంలో ఏ వాయువు ఉంటుంది.?
జ : కార్బన్ డయాక్సైడ్

12) టెలివిజన్ ను కనుగొన్నది ఎవరు.?
జ : జాన్ లోగి బయార్డ్

13) తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది.?
జ : 536 మీటర్లు

14) యాంటీబయోటిక్స్ కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు తయారుచేసిన కొత్త డ్రగ్ పేరు ఏమిటి?
జ : స్టెఫాఫెక్ట్

15) లోక్ తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మణిపూర్