DAILY G.K. BITS IN TELUGU 6th JUNE

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 6th JUNE

1) శత పత్రం పుస్తకం రచయిత ఎవరు.?
జ : గడియారం రామకృష్ణ శర్మ

2) జులై 1954లో కరీంనగర్ కు వచ్చిన ఫజల్ అలీ కమిషన్ కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది ఎవరు.?
జ : కాళౌజి నారాయణరావు

3) 1968 జులై 10న ఏ దినంగా పాటించారు.?
జ : తెలంగాణ హామీల దినము

4) తెలంగాణ ప్రాంతీయ సమితి ఎక్కడ ఏర్పాటు చేయబడింది.?
జ : ఇల్లందు

5) 1969 లో జీవో నెంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంజ్ అధిపతి ఎవరు?
జ : జస్టిస్ ఎం. హిదయతుల్లా

6) తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్ లో కేంద్రం జస్టిస్ వాంఛ్ అధ్యక్షునిగా ఇద్దరు సభ్యులతో కమిటీని వేసింది. ఆ ఇద్దరు సభ్యులు ఎవరు.?
జ ‘ ఎంసీఏ సెటల్‌వాడ్ మరియు నెరెండే

7) 1975 అక్టోబర్ లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371- డి ని విడుదల చేసింది.?
జ : జీవో నెంబర్ 674

8) తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ను రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ : ఏన్టీ రామారావు

9) ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల విస్తీర్ణాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు, పేర్లు మార్చవచ్చు.?
జ : ఆర్టికల్ – 3

10) తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు గ్రంధాన్ని రచించింది ఎవరు.?
జ : ఆదిరాజు వెంకటేశ్వరరావు

11) తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు.?
జ : మార్చి – 1 – 2014

12) లక్నో ఒప్పందం తర్వాత హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారి అను బిరుదు ఎవరికి ఇవ్వబడింది.?
జ : మొహమ్మద్ అలీ జిన్నా

13) శాసనల్లోంఘన ఉద్యమమును గాంధీజీ ఎప్పుడు విరమించాడు.?
జ : ఏప్రిల్ 1934

14) ప్రముఖ బెంగాలీ నాటకం నీలి దర్పణ్ ఇంగ్లీష్ భాష లోకి అనువదించింది ఎవరు?
జ : మైకెల్ మధుసూదన్ దత్తా

15) ఏవో హ్యూమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్ లో ముఖ్యపాత్ర నిర్వహించిన బ్రిటిష్ ఎవరు.?
జ : విలియం వెడర్ బర్న్