DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th AUGUST 2023

1) డచ్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ 2023లో విజేతగా నిలిచినది ఎవరు.? ఈ సీజన్లో ఇది అతనికి 11వ టైటిల్ కావడం విశేషం.
జ : వెర్ స్టాఫెన్

2) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తొలి స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)

3) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జాబలిన్ త్రో ను ఎంత దూరం విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గాడు.?
జ : 88.17 మీటర్లు

3) ఓకే అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మూడు స్వర్ణాలు నెగ్గిన 5వ క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నోవా లైల్స్ (అమెరికా – 100, 200, 4×100మీటర్లు)

4) ఓకే అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మూడు స్వర్ణాలు నెగ్గిన క్రీడకారులు ఎవరు.?
జ : కార్ల్ లూయిస్, మౌరిస్ గ్రీన్, టైసన్ గే, ఉసెన్ బోల్ట్

5) పనామా కాలువకు ప్రత్యామ్నాయంగా ఏ కాలువను నిర్మాణం చేపట్టాలని ఇటీవల వార్తలలో నిలిచింది.?
జ : నికరగ్వా కాలువ

6) తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఏ సంస్థతో ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంశంలో ఒప్పందం చేసుకుంది.?
జ : యూనెస్కో

7) “హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్” అనే పుస్తకాన్ని రచించిన రచయిత్రి ఎవరు.?
జ : నీరజ చౌదరి

8) చంద్రయాన్ – 3 మొత్తం భూమి నుండి చంద్రుని తాకే వరకు పట్టిన ప్రయాణ కాలం ఎంత.?
జ : 41 రోజులు

9) 8 మెగావాట్ల నిలువ సామర్థ్యం గల “బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం” ను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేసింది.?
జ : అండమాన్ నికోబార్ దీవులు

10) ఎలాక్టోరల్ డెమోక్రసీ 2023 నివేదిక ప్రకారం 178 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 108

11) ఈజిప్ట్ లో ప్రారంభమైన బహుళ దేశాల వైమానిక విన్యాసాల పేరు ఏమిటి.? ఇందులో భారత్ మిగ్ 19 యుద్ధ విమానాలు, జెట్స్, ప్రత్యేక బలగాలు పాలుపంచుకుంటున్నాయి.
జ : బ్రైట్ స్టార్

12) ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించిన బ్రియాన్ డీ ఖర్ ప్రాన్ అనే వ్యక్తి ప్రత్యేకత ఏమిటి.?
జ : మేఘాలయ రాష్ట్రంలో 1,700 గుహలను కనిపెట్టాడు

13) ఏ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్మారకార్దం 100 రూపాయల స్మారక నాణెన్ని రాష్ట్రపతి ద్రౌపది మూర్ము విడుదల చేయనున్నారు.?
జ : ఎన్టీ రామారావు

14) చంద్రయాన్ 3 నివేదిక ప్రకారం చందమామ ఉపరితలంపై మరియు 80 మిల్లీమీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు ఎంతగా ఉన్నాయి.?
జ : ఉపరితలంపై 50.5℃, 80mm లోతులో మైనస్ 10℃

15) GPS లేకుండా పనిచేసే డ్రోన్లను ఏ దేశం అభివృద్ధి చేసింది.?
జ : చైనా

16) బాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 29

17) జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా చంద్రుని పైకి స్పేస్ క్రాఫ్ట్ ను H2A రాకెట్ ద్వారా పంపనున్న మిషన్ పేరు ఏమిటి.?
జ : సాఫ్ట్ లాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ మూన్ (SLIM)

18) వ్యవసాయ రంగంలో ఏ తెలంగాణ ప్రభుత్వ సంస్థను జాతీయ నోడల్ ఏజెన్సీగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటీవ్ అసోషియేషన్(HACA)