DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st JUNE 2023

1) వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం మొదటి, చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఐస్ ల్యాండ్, ఆఫ్ఘనిస్తాన్

2) వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 127 (146 దేశాలలో)

3)ఉక్లా ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత్ మే నెలలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 56వ

4) ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ఎక్కడ నిర్వహించిన యోగ ఉత్సవాలు గిన్నిస్ రికార్డులు ఎక్కాయి.?
జ : సూరత్ లో ఒకేసారి 1.53 లక్షల మంది యోగా చేశారు

5) ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్ లలో బౌలింగ్ మరియు బ్యాటింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ & జో రూట్

6) ఎమర్జింగ్ మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది?
జ : భారత మహిళల క్రికెట్ జట్టు

7) 200 ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడి రికార్డు సృష్టించిన క్రీడాకారుడు ఎవరు.?
జ : క్రిస్టియానో రోనాల్డో

8) ఆసియాలో అత్యధిక గోల్స్ (90) చేసిన రెండవ ఫుట్ బాల్ క్రీడాకారుడుగా ఎవరు రికార్డు సృష్టించారు. ?
జ : సునీల్ ఛెత్రీ – (అలీ దాయ్ 109)

9) స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడం కోసం మూడు లక్షల ఆర్థిక సహాయం చేసే ఏ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.?
జ : గృహలక్ష్మి

10) అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ గా భారతదేశంలోని ఏ కంపెనీ నిలిచింది.?
జ : టాటా పవర్

11) ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో 5జి వినియోగదారుల సంఖ్య 57 శాతానికి చేరనుంది.?
జ : 2028

12) ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయ నిర్మాణాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించనున్నారు.?
జ : కొల్లూరు (సంగారెడ్డి జిల్లా)

13) ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రోడక్టివిటీ కెపాసిటీస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారత్ ఎంత శాతం కలిగి ఉంది.?
జ :45.28%

14) హైదరాబాదులో తన కార్యకలాపాలను ప్రారంభించనున్న బ్రిటన్ బ్యాంకింగ్ సంస్థ ఏది.?
జ : లాయిడ్స్

15) తెలంగాణలో ఎక్కడ మెధా సంస్థ రైల్ కోచ్ ప్యాక్టరీని ప్రారంభించనుంది.?
జ : కొడంగల్

16) మైక్రాన్ కంపెనీ సెమీ కండక్టర్ ల టెస్టింగ్, ప్యొకెజింగ్ యూనిట్ ను ఎక్కడ స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అమోదం లభించింది.?
జ : గుజరాత్

17) ఇటీవల ప్రారంభమైన పూరి జగన్నాథుడి రథయాత్ర ఏ రాష్ట్రానికి సంబంధించింది.?
జ : ఓడిశా

18) ఏ విమానయాన సంస్థ 500 విమానాల కొనుగోలు కోసం 50 బిలియన్ డాలర్ల ను వెచ్చించనుంది.?
జ : ఇండీగో

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st JUNE 2023

TELEGRAM