1) జూన్ 2023 మాసానికి గాను వసూలైన జిఎస్టి ఎంత.?
జ : 1,61,497 కోట్లు
2) ఆసియా క్రీడలు 2023 ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : చైనాలోని హోంగ్జౌ
3) లుసానే డైమండ్ లీగ్ – 2023 జావెలిన్ త్రోలో అగ్రస్థానంలో నిలిచిన భారత త్రోయర్ ఎవరు?
జ : నీరజ్ చోప్రా
4) భారత టెన్నిస్ ప్లేయర్ యూకి బాంబ్రీ – లాయిడ్ హరీస్ తో కలిసి ఏ ఏటీపీ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు.?
జ : మలోర్కాఛాంపియన్స్ షిప్ ఎటీపీ – 250 టోర్నీ
5) ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ అందించే “తార పురస్కారాన్ని” గెలుచుకున్న భారతీయ దర్శకురాలు ఎవరు.?
జ : కార్తీకీ గోనీ (ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలు)
6) మార్క్ సాండ్ అవార్డును దక్కించుకున్న తమిళనాడుకు చెందిన ఏనుగుల పరిరక్షణ సంఘం పేరు ఏమిటి.?
జ : ది రియల్ ఎలిఫెంట్ కలెక్టీవ్ (TREC)
7) ఇటీవల వార్తల్లో నిలిచిన “ఇన్‌జెన్యూటీ” హెలికాప్టర్ ను నాసా ఏ గ్రహం పైకి ప్రయోగించింది.?
జ : అంగారకుడు
8) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పర్చిన కొత్త మండలం పేరు ఏమిటి.?
జ : సోనాల
9) ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జో రూట్ (176) అత్యధికం ద్రావిడ్ (210)
10) పేదవాళ్ళకి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే టీ – డయాగ్నస్టిక్స్ లో ఉచిత వైద్య పరీక్షల సంఖ్యను ప్రభుత్వం ఎంతకు పెంచింది.?
జ : 134
11) అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ సిప్రీ నివేదిక ప్రకారం భారత్ వద్ద ఎన్ని అణు వార్ హెడ్లు ఉన్నాయి.?
జ : 16
12) SAFF ఛాంపియన్షిప్ 2023 లో ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ & కువైట్
12) గ్రీస్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : మిట్సోటాకిస్ కైరియాస్
13) ఏ రాష్ట్రం 75 సరిహద్దు గ్రామాలకు భారత స్వతంత్ర పోరాట యోధుల పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.?
జ : త్రిపుర
14) HDFC బ్యాంక్ చైర్మన్ పదవి నుండి ఇటీవల తప్పుకున్నది ఎవరు.?
జ : దీపక్ ఫారెఖ్
15) “గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డును” ఎవరికి ఇండో యూకే అవార్డులలో ప్రధానం చేశారు.?
జ : మేరీ కోమ్
16) ఏ రాష్ట్రానికి చెందిన ఏడు వస్తువులకు జియోగ్రాఫికల్ ఐడెంటీపికేషన్ గుర్తింపును ఇటీవల ఇచ్చారు.?
జ : ఉత్తరప్రదేశ్
17) ఏ రాష్ట్రం అత్యధిక ఎలక్ట్రానిక్స్ ఎగుమతి చేసిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.?
జ : తమిళనాడు
18) కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిని గుర్తించడానికి ఏ సూచీ ని ప్రవేశపెట్టింది.?
జ : పంచాయితీ డెవలప్మెంట్ ఇండెక్స్ (PDI)
19) సెమీ కండక్టర్ల పరిశ్రమను ఎక్కడ నెలకోల్పడానికి గుజరాత్ ప్రభుత్వంతో మైక్రాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది.?
జ : సనంద్ (ఆహ్మదాబాద్)
20) FIFA తాజా రంటిమిల్లు అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది.?
జ : అర్జెంటీనా