DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th AUGUST 2023

1) ఐదేళ్ల చిన్న వయసులోని ఫీడే రేటింగ్ సాధించిన ఉత్తరాఖండ్ కు చెందిన చెస్ ఆటగాడి పేరు ఏమిటి.?
జ : తేజస్ తివారీ

2) ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సంవత్సరం పాటు, పురుష ఉద్యోగులకు నేలపాటు మాతృత్వ సెలవులను ప్రకటించిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం

3) జన్ ధన్ యోజన ఖాతాల సంఖ్య ఎన్ని కోట్లకు చేరినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 50 కోట్లు

4) ఇన్ఫోసిస్ కో చైర్మన్ సుధా నారాయణమూర్తి ఇటీవల ఆవిష్కరించిన చిన్న పిల్లల పుస్తకం పేరు ఏమిటి?
జ : కామన్ ఎట్ అన్ కామన్

5) జాతీయ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI) 108 రేకులు కలిగిన కమలం పుష్పాన్ని అభివృద్ధి చేసింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : NAMO H – 108

6) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2023లో ఒకేరోజు స్వర్ణం, మరియు కాంస్యం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : మోహులీ ఘోష్

7) ఫీఫా పుట్‌బాల్ మహిళల ప్రపంచ కప్ 2023 లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఏవి.?
జ : స్వీడన్ & ఆస్ట్రేలియా

8) ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రెండు కొత్త రెవిన్యూ మండలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పేర్లు ఏమిటి.?
జ : సాత్నాల, భోరజ్

9) 2024 ఫిబ్రవరి 26 నుండి హైదరాబాద్ వేదికగా జరగనున్న 21వ బయో ఏసియా సదస్సు యొక్క థీమ్ ఏమిటి.?
జ : డేటా, కృత్రిమ మేధా ద్వారా అవకాశాల పునర్ నిర్వచనం

10) ఐటీఎఫ్ టెన్నిస్ టోర్ని పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఎవరు.?
జ : సాయికార్తీక్ రెడ్డి – హువాంగ్ సంగ్

11) ప్రపంచ అర్చరీ నాలుగో అంచె పోటీలలో స్వర్ణాలు నెగ్గిన భారత కాంపౌండ్ జట్లు ఏవి.?
జ : జ్యోతి సురేఖ – అదితి స్వామి – పర్నీత్ కౌర్
అభిషేక్ వర్మ – ఓజాస్ – ప్రథమేశ్

12) భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదయింది.?
జ : కేరళ (కన్నూర్ జిల్లా)

13) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 19

14) ప్రపంచ మానవత్వ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 19

15) ప్రపంచ దోమల దినోత్సవం లేదా ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 20

16) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. జయంతి ఏ రోజు.?
జ : ఆగస్టు 18