DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th JULY 2023

1) 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లి కానీ వారికి పెన్షన్ ఇచ్చే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : హర్యానా

2) స్వలింగ వివాహాలను ఆమోదించిన తొలి దక్షిణాసియా దేశంగా ఏ దేశం నిలిచింది.?.
జ: నేపాల్

3) కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : లక్ష్య సేన్

4) నదులు లేని దేశాలలో అతిపెద్ద దేశం ఏది?
జ : సౌదీ అరేబియా

5) బలత్కారానికి గురైన బాలికల వైద్య మరియు ఆర్థిక సహాయానికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఏమిటి ?
జ : మిషన్ వాత్సల్య

6) ఏ సంస్థ ‘అంతరదృష్టి’ పేరుతో డాష్ బోర్డును ఏర్పాటు చేసింది.?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

7) భారత్ యొక్క ఏ పొరుగు దేశంలో 2023 మే మాసంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 37.9 శాతానికి చేరింది?
జ : పాకిస్తాన్

8) ఫీపా మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ 2023 కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : ఆస్ట్రేలియా & న్యూజిలాండ్

9) ఐసోచాం చేత మినరల్ డెవలప్మెంట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు అందుకున్న సంస్థ ఏది.?
జ : NMDC

10) అమెరికా ప్రారంభించిన శాంతియుత ప్రయోజనాలు కోసం అంతరిక్ష అన్వేషణ కార్యక్రమం ‘ఆర్టిమిస్ అకార్ట్స్’ లో భారత్ ఎన్నో దేశంగా చేరింది.?
జ : 27

11) కేంద్ర తాజా గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం అతి తక్కువగా 880 గా ఉంది.?
జ : పంజాబ్ (AP – 1061, TS 1385)

12) ఏ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా లేకుండానే ఒక మంత్రిని ఇటీవల తొలగించారు.?
జ : తమిళనాడు

13) పోర్ట్స్ పత్రిక ఇటీవల విడుదల చేసిన అమెరికాలో స్వయంకృషితో ఎదిగిన సంపన్న మహిళల జాబితాలో ఎంతమంది భారతీయ మహిళలకు చోటు సంపాదించుకున్నారు ?
జ : నలుగురు

14) ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరించారు.?
జ : కౌలాలంపూర్ – మలేషియా

15) ఏ సంస్థ నివేదిక ప్రకారం జైలులో ఉన్న ఖైదీలకు క్షయ సోకే ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.?
జ : లాన్సెట్

16) నాటో కూటమి (31 దేశాలు) శిఖరాగ్ర సదస్సు జూలై 11, 12 వ తేదీలలో ఎక్కడ జరుగుతుంది.?
జ : విల్నిసియా (లిథువేనియా)

17) లోకమాన్య తిలక్ అవార్డు 2023 గాను ఎవరికి ప్రధానం చేయనున్నారు.?
జ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

18) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (504 అడుగులు) దేవాలయాన్ని భారత దేశంలో ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జ : జశ్పూర్ గ్రామం (గుజరాత్)

19) ప్రపంచ యూత్ ఆర్చరీ పోటీలలో రికర్వ్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పార్దు సాలుంకె

20) ప్రపంచ యూత్ అర్చరీ పోటీలు 2023లో భారత్ 11 పథకాలతో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండో స్థానంలో (గోల్డ్ ఆరు, సిల్వర్ ఒకటి బ్రాంచ్ 4) (దక్షిణ కొరియా మొదటి స్థానం)

21) ఐపీఎల్ బ్రాండ్ విలువ ఎన్ని వేల కోట్లకు చేరింది.?
జ : 26,432 కోట్లు

22) ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏ దేశ అథ్లెటిక్స్ సంఘానికి ఉత్తమ అథ్లెటిక్స్ సంఘం అవార్డు ఇచ్చింది.?
జ : భారత్

23) సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ చాంపియన్షిప్ లో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : కార్లసన్

24) యునెస్కో నివేదిక ప్రకారం 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ కానున్నారు.?
జ : 8.4 కోట్లు

25) ఐఐటి మద్రాస్ అనుబంధంగా జింజిబార్ లో స్థాపించిన ఐఐటీకి డైరెక్టర్ గా నియమించబడిన తొలి మహిళగా ఎవరు నిలిచారు.?
జ : ప్రీతి అఘలయం