DAILY CURRENT AFFAIRS IM TELUGU 17th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IM TELUGU 17th AUGUST 2023

1) ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ 2023 ఓపెన్ విభాగంలో సెమీఫైనల్ కు చేరిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : ప్రజ్ఞానంద

2) చంద్రయాన్ 3 మిషన్ లో ల్యాండర్ పేరు ఏమిటి.?
జ : విక్రమ్

3) చంద్రయాన్ 3 మిషన్ లో రోవర్ పేరు ఏమిటి.?
జ : ప్రజ్ఞాన్

4) భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ గా ఎవరిని బిసిసిఐ నియమించింది.?
జ : అజిత్ అగార్కర్

5) ఇస్రో చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని ఏరోజు ప్రారంభించింది.?
జ : జూలై 14 – 2023

6) తక్కువ కార్బన్ ఇంధనం విడుదల చేసే కంపెనీగా మారడానికి ఏ కంపెనీ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.?
జ : ONGC

7) బ్యాంకులలో ఎవరు క్లైమ్ చేసుకోకుండా మిగిలిపోయిన అకౌంట్ లలో వివరాలను తెలపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : UDGAM (UNCLAIMED DEPOSITS GATE WAY TO ACCESS INFORMATION)

8) అమెరికాకు చెందిన యాక్షన్ ఫర్ నేచర్ సంస్థ 2023 సంవత్సరానికి గాను 17 మంది “యంగ్ ఎకో హీరో” పురస్కారాలలో భారత్ కు ఎన్ని దక్కాయి.?
జ : 5

9) ‘పర్యావరణం కోసం జీవనశైలి’ అని లక్ష్యంతో భారత ప్రభుత్వం – ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : మిషన్ లైఫ్

10) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ వింద్యాగిరి యుద్ధ నౌకను ఎక్కడ జలప్రవేశం చేయించారు.?
జ : కోల్‌కతా హుగ్లీ నది తీరం

11) హైదరాబాదులోని ఇందిరా పార్క్ – విఎస్టి కూడలి మధ్య నిర్మించిన 2.7 కిలోమీటర్లు స్టీల్ వంతెనకు ఎవరి పేరును పెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.?
జ: నాయిని నరసింహారెడ్డి

12) ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు ఎవరు.?
జ : అదిల్ సుమరివాలా

13) జోర్డాన్ లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పసిడి పథకం నెగ్గిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : ప్రియ

14) బ్యాంకులు వినియోగదారులకు వేగంగా రుణాలు కల్పించే ఉద్దేశంతో వినియోగదారుల వివరాలతో కూడిన ఏ ప్లాట్‌ఫాంను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది .?జ : పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం

15) ప్రపంచ కప్ అర్చరీ నాలుగో అంచె పోటీలు -2023 ఏ నగరంలో జరుగుతున్నాయి.?
జ : పారిస్

16) ఓ నివేదిక ప్రకారం భారత్ లోని ఏ ఎడారిలో వచ్చే శతాబ్దం వరకు పచ్చదనం పెరుగుదల ఉంటుందని తెలిపింది.?
జ : థార్ ఎడారి